calender_icon.png 15 November, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

15-11-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కాలే యాదయ్య 

మొయినాబాద్, నవంబర్ 14 (విజయ క్రాంతి): నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలు యాదయ్య కోరారు. శుక్రవారం మొయినాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని  సురంగల్ లో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కు  శంకుస్థాపన చేసి, పలువురు లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మొయినాబాద్ పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మొయినాబాద్ మున్సిపల్, మండలం లో ని 40 మంది  లబ్ధిదారులకు మంజూరైన   కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

కాంగ్రెస్‌తోనే పేదల కల సాకారం

చేవెళ్ల, విజయక్రాంతి : పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం గుండాల గ్రామవాసి మంగలి లక్ష్మమ్మ కు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో వారు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల నెరవేరింది అన్నారు.

నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గుండాల గ్రామంలో ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, ముడిమ్యాల పిఎసిఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, గుండాల పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్లు ధవల్గారి గోపాల్ రెడ్డి, పడాల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.