పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
- 17వ వార్డ్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
గజ్వేల్: పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని గజ్జంతజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం పిలుపునిచ్చింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 6వ రోజు తడిచెత్త, చెత్త పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్ పర్సన్ పద్మబాయి నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ లు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి పారిశుద్ధ కార్మికులకు అందించాలని, వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. మొక్కలు నాటి పరిరక్షించాలని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ స్వచ్ఛ మున్సిపల్ గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందనన్నారు.
ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయిని సత్యలక్ష్మి యాదగిరి, స్వప్న సురేష్, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, రొట్టెల శ్రీనివాస్, 17 వ వార్డు సభ్యులు మామిడి శంకర్, హనుమంత్ రెడ్డి తాళ్ల నాగరాజు,శంకరప్ప,ఎర్రవాడ బాలకృష్ణ,శంభు గారి ప్రశాంత్, శివ ,వేణు, గుంటుకు నరసింహులు, టిఆర్ఎస్ పార్టీ పార్టీ సీనియర్ నాయకులు,మునగారి రాజు, గాజుల శ్రీనివాస్ వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




