14-11-2025 11:24:20 PM
- ప్రతిపక్షాల ఆరోపణలకు చెంపపెట్టు
- బోయినపల్లిలో సంబరాల్లో పాల్గొన్న ఏంఎల్ఏ మేడిపల్లి సత్యం
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి:(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు సరైన తీర్పురనిచ్చి ప్రజాపాలనకు పట్టం కట్టారని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వీట్ తినిపించి ప్రజల పంపిణీ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున టపాకాయలు వేసి సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ బిఆర్ఎస్ బిజెపి నాయకులు ప్రభుత్వంపై అడ్డమైన ఆరోపణ చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు వారు చెంప చెల్లుమనిపించి ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనమని తీర్పు చెప్పారని అన్నారు. ఇకనైనా టిఆర్ఎస్ బిజెపి నాయకులు తప్పుడు ఆరోపణలు మానుకుని బురద చల్లే ఆరోపణ చేయవద్దని ఆయన హితవు పలికారు. బిఆర్ఓ చేసిన అవినీతి అక్రమాలను గుండాగిరి ప్రభుత్వ పాలనను ప్రజలు ఇంకా మరిచిపోలేరని ఆయన చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో పాటు అభివృద్ధికి పట్టంకట్టి బాసట గా నిలిచారని చెప్పారు.
ఇకనైనా వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు. అనంతరం ఇదే మండలంలోని దేషాయిపల్లి కి చెందిన పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి తల్లి మృతిచెందగా ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల తో కలిసి పరామర్శించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసి డైరెక్టర్ బోయిని ఎల్లేష్ యాదవ్, మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మీరాజం, ఎనుగుల కనకయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.