calender_icon.png 15 November, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి

15-11-2025 12:00:00 AM

పోలీసు కమిషనర్ ఎం.విజయ్ కుమార్

సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:14జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో బాలల దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మానికి పోలీసు కమిషనర్ ఎం.విజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. పిల్లల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన పెంచాలని, ఎక్కడైనా అసభ్య ప్రవర్తన కనపడితే వెంటనే డయల్ 100 చేయాలని సూచించారు.

ఆరోగ్యానికి సరైన ఆహారం, వ్యాయామం అవసరమన్నారు. పుస్తకాలు చదివే అలవాటు పెంచుకోవాలని, జీవితంలో లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరొచ్చన్నారు. కృప భవనం, బాలసదనం, ఆశా జ్యోతి, శిశుగృహం, చిన్నారులు నృత్యాలు, శ్లోకాలతో ఆకట్టుకున్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, పిల్లలు పుష్టికర ఆహారం తీసుకొని చదువులో ముం దుండాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ శారదా, డిఆర్‌ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిఎంహెచ్‌ఓ ధనరాజ్, డిపిఓ వినోద్ కుమార్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి సాయి పాల్గొన్నారు.