31 May, 2026 | 9:21 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

రోడ్డు భద్రతపై టేకులబస్తిలో ప్రజల ప్రతిజ్ఞ

13-04-2026 06:39 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి రోడ్డు ప్రమాధాల నుంచి మరణాల నివారణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 15వ వార్డు టేకులబస్తి కౌన్సిలర్ చింతల వసంత పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత ప్రమాధాల నివారణపై సోమవారం టేకులబస్థిలో బెల్లంపల్లి వన్ టౌన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ కంపెల జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ప్రతిజ్ఞ కార్యక్రమానికి  కౌన్సిలర్ వసంత ముఖ్యతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు అనుసరించాల్సిన రక్షణ సూత్రాలను ప్రజలు పాటించాలని రాష్ట్ర డీజీపీ పిలుపునిచ్చారని ఆమె పేర్కొన్నారు.

ప్రజలు సంఘటితంగా ఉండి రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలతో  ప్రజలు అంగవైకల్యులు కాకుండా చూడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తామని కౌన్సిలర్ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ ఆడెపు పద్మ, ఆశా కార్యకర్త సుజాత, ఆయమ్మ కమల, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ జిల్లా కన్వీనర్ దేవసాని ఆనంద్, కాంగ్రెస్ నాయకులు కసిపాక రాజరత్నం, ఎండీ గౌస్, బొల్లి వంశీకృష్ణ, ఎస్ కే సాధిక్ తదితరులు పాల్గొన్నారు.