15 March, 2026 | 7:53 AM

కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

15-12-2025 01:08 AM
  1. ఎన్నికల సంఘాన్ని బెదిరించింది
  2. ఎక్స్‌వేదికగా రాంచందర్ రావు

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్, దానితీరుపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని బహిరంగంగా బెదిరించిందని, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం ప్రకటించిందని తెలిపారు.

‘మోదీ, తేరీ కబర్ ఖుదేగీ’ వంటి నినాదాలు చేసిందన్నారు. ఈతరహా వ్యాఖ్యలు రాహుల్‌గాంధీ, అతని బృందం నిజమైన ఎజెండాను తెలిసే లా బహిర్గతం చేశాయన్నారు. ప్రజాస్వా మ్య సంస్థలు, జాతీయ ఐక్యతను అణగదొక్కడానికి లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ ్యలుగా వీటిని చూడాలని ఆయన తెలిపారు. 

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అభినందనలు

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబిన్‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్‌తోపాటు మరికొంత మంది నేతలు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. పీఎం నరేంద్రమోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నాయకుల నాయకత్వంలో నితిన్ నబిన్ పార్టీని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.