17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

06-06-2025 12:24 AM
  1. చౌక ధర దుకాణాల్లో రికార్డులు సరిగ్గా నిర్వహించాలి
  2. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ స్వంత ఇంటి కల సాకారం చేసుకోవాలి
  3. తేమ వచ్చిన వెంటనే వరి తూకం చేసిమిల్లుకు తలించాలి:జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జూన్ 5 ( విజయక్రాంతి ) :   భూ భారతి రె వెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజలను సూచించారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా గురువారం పెబ్బేరు మండలంలోని రంగాపూర్, శ్రీరంగాపూర్ మండలంలోని నాగసాని పల్లి గ్రా మాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ సం దర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలను ఉ ద్దేశించి మాట్లాడుతూ ప్రజలు తమ భూ సమస్యలు ఏము న్నా నిర్ణిత ప్రొఫార్మలో పూరించి అధికారులకు ఇవ్వాలని అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తార న్నారు. షెడ్యూలు ప్రకారం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 చౌక ధర దుకాణాల్లో రికార్డులు సరిగ్గా నిర్వహించాలి

 ప్రతి చౌక ధర దుకాణంలో బియ్యం నిల్వలు, లబ్ధిదారులకు ఇచ్చిన బియ్యం తదితర రికార్డులు సక్రమంగా నిర్వ హించాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం శ్రీరంగాపూర్ మండలంలోని నాగసాని పల్లి గ్రామంలోని చౌక ధర దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించిన కలెక్టర్ నిర్వహణ సరిగ్గా చేయాలని, రో జువారీగా రికార్డులు నవీకరణ చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ స్వంత ఇంటి కల సాకారం చేసుకోవాలి

మొదటి విడతలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేసుకొని లబ్ధిదారులు తమ స్వంత ఇంటి కల నెరవేర్చుకోవాలని సూచించారు. నాగసాని పల్లి గ్రామంలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సం దర్శించారు.

గోవిందమ్మ భర్త పేరు కుర్మయ్య ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు లక్ష రూపాయ లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, త్వరలోనే మిగిలిన డబ్బులు జమ చేయడం జరుగుతుందని భరో సా కల్పించారు. త్వరగా పూర్తి చేసుకొని స్వంత ఇంటి కల సాకారం చేసుకోవాలని సూచించారు.

తేమ వచ్చిన వెంటనే వరి తూకం చేసి మిల్లుకు తలించాలి

వరి కొనుగోలు కేంద్రాల్లో తాలు, తేమ చూసుకొని నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే తూకం చేసి మిల్లులకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం పె బ్బేరు మండలంలోని పాతపల్లి గ్రామ ఐ.కే.పి సెంటరును కలెక్టర్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఇంకా ఎంత వడ్లు ఉన్నాయి, వాటి తేమ శాతం ఎంత ఉంది అనే వివరాలు అ డిగి తెలుసుకున్నారు.

వడ్లు కొనుగోలు చివరి దశకు చేరుకుందని, తేమ వచ్చిన వడ్లను తూకం చేసి లారీల్లో నింపుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు. తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా సివిల్ సప్లై అధి కారి విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, శ్రీరంగాపూర్ తహసిల్దార్ రాజు, పెబ్బేరు తహసిల్దార్ పి. మురళి, ఆర్.ఐ ఇతర సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.