2 July, 2026 | 10:47 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

14,000 మంది గాత్రంలో ‘జనగణమన’

16-08-2024 01:15 AM
  1. గ్రామీ విజేత రిక్కీ కేజ్ సృష్టించిన అద్భుతం
  2. ఈ ఫీట్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు

న్యూఢిల్లీ, ఆగస్టు 15:  వంద మందికి పైగా బ్రిటిష్ ఆర్కెస్ట్రా.. 14 వేల మంది బాలబాలికల గాన ప్రవాహం.. అందరినోట ‘జనగణమన’.. మధ్య మధ్యలో దిగ్గజ వాద్యకారుల వాద్యాల టచ్.. సాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా సరికొత్త ఫీట్ సృష్టించారు భారత్‌కు చెందిన ప్రముఖ సంగీతకారుడు, గ్రామీ అవార్డు విజేత రిక్కీ గేజ్. ఆయన కృషి ఫలించి ఈ ఫీట్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు లభించడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈవెంట్‌లో దిగ్గజ సంగీత విద్యాంసులు పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, రాకేశ్ చౌరాసియా, రాహుల్ శర్మ, అమన్, అయాన్ అలి బంగాశ్, జయంతి కుమరేశ్, షేక్ మహబూబ్, యూకేలోని రాయల్ ఫిల్ హార్మోనిక్ అర్కెస్టాకు చెందిన 100 మంది సంగీత కళాకారులు పాలుపంచుకున్నారు. జనగణమన పాడిన మొత్తం 14 వేల మందీ ఆదివాసీలే కావడం మరో విశేషం. వీరంతా కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు.

వీరంతా ‘భారత్’ అంగ్ల, హిందీ అక్షర క్రమంలో నిల్చొని జాతీయ గీతాన్ని ఆలపించారు. గీతాలపనపై  రిక్కీ కేజ్ స్పందిస్తూ.. ‘చిన్న వయస్సులో నేను విన్న తొలి గీతం.. సంగీతం జాతీయ గీతమే. అంతటి గీతాన్ని నా నేతృత్వంలో పాడించడం ఆనందాన్నిచ్చింది. వీఆర్ ఫిల్మ్‌మేకర్ సాయిరామ్ సాగిరాజుతో పాటు మరికొందరు డెవలపర్ల సాయంతో రిక్కీ కేజ్ ఈవెంట్‌ను రూపొందించారు. ఆయన గతంలోనూ ఇలాంటి వైవిధ్యమైన ప్రదర్శనలు ఇచ్చారు.