తెలంగాణలో బీజేపీ ఎక్కడుందో చూపించాం
బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీ ఎక్కడుం ది? అన్న వారికి చెంపపెట్టు సమాధానం చెప్పామని, ఎక్కడుందో కళ్లకు కట్టినట్టు చూపించామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ ఉనికి ఘనంగా చాటామని వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజే పీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు సాధించి తమ పార్టీ సత్తా చాటిందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యమ్నాయమని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో వాయిదాలు వేసుకుంటూ వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు తాజాగా ఆగస్టు 15వ తేదీకి వాయిదా వేశారని, అయితే ఆ మాట మీద ఉంటాడనే గ్యారెంటీ లేదని పేర్కొన్నారు. కొత్తగా డిసెంబర్ 9న తెలం గాణ తల్లి ఉత్సవాలు జరుపుతామన్న రేవంత్, ఇప్పుడు రైతు రుణమాఫీని మళ్లీ వాయిదా వేస్తాడేమోననే అనుమానం వ్యక్తంచేశారు. సమైక్య రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విత్తనాల కోసం రైతులు క్యూలో చెప్పులు పెట్టిన సందర్భాలు మర్చిపోలేదని, ఇప్పుడు చెప్పు ల బదులు పాస్‌బుక్కులు పెడుతున్నారని గుర్తుచేశారు. సమావేశంలో అధికా ర ప్రతినిధులు విఠల్, కిశోర్ పోరెడ్డి పాల్గొన్నారు.






