15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు

17-02-2026 08:42 PM

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజలు తిరిగి మళ్లీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తెలంగాణ ప్రజల జాతిపిత కెసిఆర్ పుట్టినరోజు వేడుకల్లో మండల టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయినప్పటికీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చటములో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.

గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయుటకు పూర్తిస్తారని లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉందని అన్నారు. రెండు సంవత్సరాల కాలంలోనే హామీలను నెరవేర్చకపోవడంతో మళ్లీ కెసిఆర్ ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, తునికి సాయిలు, దొంగరి శ్రీనివాస్, సర్పంచులు తప్పట్ల ఎల్లయ్య ,కుంచాల శ్రీనివాస్ రెడ్డి చింతకుంట్ల మనోజ్,  రమేష్, ఉప సర్పంచ్ కవిత మట్టపల్లి వెంకట్ ,బొజ్జ సాయికిరణ్, గోపగాని రమేష్ గౌడ్ ,గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, మల్యాల రాములు, తడకమల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.