17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

శాతవాహన యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 08:47 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కేసీఆర్ జన్మదినం సందర్భంగా భారత రాష్ట్రా సమితి విద్యార్థి విభాగం శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి, కెసిఆర్ లాంగ్ లీవ్  నినాదాలతో, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా అనే అనుమానాల మధ్య ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తది అది బంగారు తెలంగాణగా మారుతుందని నమ్మిండు ఉక్కు సంకల్పం కలిగిన ఆ ఒక్కడే కేసీఆర్ ఉద్యమాల తెలంగాణను పదేళ్లలోనే ఉజ్వల తెలంగాణగా మార్చి దేశానికే తలమానికంగా నిలిపిన ధీరుడు కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు తిప్పనపల్లి ప్రకాష్, బిఆర్ఎస్వి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు  నాయిని అన్వేష్, యూనివర్సిటీ నాయకులు శ్రీకాంత్, శ్రావణ్, రమేష్, రాజు, విక్రమ్, సృజన, శ్రీజ, మనోజ్ఞ, కీర్తి, నవనీత, రక్షిత, గీత, రమ్య, రజిత, నేహా, రశ్మిత, అనిత, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.