15 April, 2026 | 12:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జేఈఈ మెయిన్స్‌లో ఎన్ఆర్ఎస్ విద్యార్థుల ప్రతిభ

17-02-2026 08:39 PM

93.52 పర్సంటైల్ తో సత్తా చాటిన విద్యార్థులు

కోదాడ: తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ ఐఐటీ & మెడికల్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభను కనబరచి మంచి పర్సంటైల్ సాధించినట్లు ఆ అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్యలు మంగళవారం తెలిపారు. కాలేజ్ కు చెందిన వై.శరణ్య అన్ని విభాగాలలో 93.52 పర్సంటైల్  సాధించినట్లు తెలిపారు.

అదే విధంగా మ్యాథ్స్ విభాగంలో కాలేజీకు చెందిన ఎన్.యశస్వినిని 98.27, పీ. అమృత సుధా వర్షిణి 97.69 పర్సంటైల్ సాధించినట్లు వారు తెలిపారు. కాలేజ్ కు చెందిన  50 మంది విద్యార్థులకు పైగా  90కి పైగా పర్సంటైల్ సాధించి  ఐఐటీ లు, ఎన్ ఐ టీ లలో సీట్లు పొందేందుకు అర్హత సాధించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ వడ్డే రాజేష్, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, వైస్ ప్రిన్సిపాల్ పీఎన్ఆర్, క్యాంపస్ ఇంచార్జి మౌనిక, పలువురు లెక్చరర్లు అభినందించారు.