17-10-2025 11:10:48 PM
చేగుంట: రాష్ట్ర స్థాహి గ్రూప్ వన్ ఫలితాల్లో ఎంపికై, ఎంపీడీవోలుగా శిక్షణ పొందుతున్న టైనీ అధికారులు, చేగుంట మండలంలోని చిన్న శివనూర్ గ్రామాన్ని చేగుంట ఎంపీడీఓ చిన్నరెడ్డి తో కలిసి శుక్రవారం సందర్శించారు. శిక్షణలో భాగంగాగ్రామస్థాయి పరిపాలన విధానాన్ని పాటు పలు అభివద్ధి పనులను చూపించి గ్రామ స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఎంపీడీఓ చిన్నరెడ్డి వారికీ వివరించారు.
మండల అభివృద్ధి కొరకు అధికారులు ఏ అంశాలపై దృష్టి సారించాలి,గ్రామ పరిపాలన విధానాన్ని, ఏ విధంగా గ్రామాలను,అభివృద్ధి చేసుకోవాలి అనే అంశాల గురించి, ట్రైని అధికారులకు ఎంపీడీవో చిన్న రెడ్డి వివరించారు. అనంతరం శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎంపీడీవోలకు, చిన్న శివనూర్తో పాటు మండలం లోని పలు గ్రామాల్లోని నర్సరీలు, డంపింగ్ యార్డ్, విధి లైట్ల, తదితరల అంశాల పైన వారికీ అవగాహనా కల్పిచడం జరిగింది.