టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాటం
బడుల్లో కేర్ టేకర్లను నియమించాలి
ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రానికి ప్రోగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ (పీఆర్టీయూటీఎస్) నిరం తరం పోరాటం చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు. పీఆర్టీయూటీఎస్‌కు అనుబంధంగా ప్రోగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసి యేషన్ (పీఆర్‌జీటీఏ) ఏర్పాటైన సందర్భంగా ఆవిర్భావ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు సమస్యను, అన్ని బడుల్లో హెల్త్ కేర్ టేకర్లను నియమించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. ఈ నెలలోనే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.






