30 May, 2026 | 9:19 PM

Breaking News

పొగాకుకు దూరంగా ఉండండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి   •   నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు   •   ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి   •   ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం   •   సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •  

విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలి

24-02-2026 12:31 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాం తి): రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర తల్లుల సంఘం రాష్ట్ర కన్వినర్ జి. భాగ్యలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో సంఘం రాష్ట్ర కార్యదర్శి కొత్త సాయి లక్ష్మితో కలసి ఆమె మాట్లాడారు. బడ్జెట్ లోటుతో గత 12 ఏళ్లలో ఉన్నత విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని,

వచ్చే విద్యా సంవత్సరంలోపు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 25 శా తం సీట్ల కేటాయింపును అమలు చేయాలన్నా రు. ఈ సమావేశంలో పలు జిల్లాల కన్వినర్లు బి.లలిత, ఎస్.శోభ, ఎస్.రాధ, ఎల్.కవిత, జి.విజయలక్ష్మి, ఇ.జయలక్ష్మి, ఎండీ. రూబీనా బేగం, ఆర్. పుష్ప పాల్గొన్నారు.