30 May, 2026 | 9:48 PM

Breaking News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు   •   వరద సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించిన యూఎస్‌టీ సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రశంస   •   రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి   •   ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష   •   విత్తనాల కొనుగోలులో రశీదు తప్పనిసరి   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   రికార్డు స్థాయిలో పంట కొనుగోలు   •   బిఆర్ఎస్ కార్యకర్త రెండు కాళ్లు కోల్పోవడంతో పరామర్శించిన మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యేలు   •   బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి   •   రైతులకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్   •  

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

24-02-2026 12:30 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి23(విజయక్రాంతి): ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామానికి చెందిన సోంది నందిని నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోంది నందిని దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సొంతిల్లు ఉండాలనేదే సర్కారు ప్రధాన లక్ష్యమని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా పినపాక నియోజకవర్గం ఇందిరమ్మ ఇల్లు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, తుమ్మల నాగేశ్వరావుకి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచులు సర్పా నాగమణి, బొర్రా సుభద్ర, పద్మ, వాణి,బాదం వెంకటేశ్వర రెడ్డి, సురేందర్, మంద నాగరాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.