ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం
- ఎల్‌డీఎఫ్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన కేరళం సీఎం పినరయి
- యూడీఎఫ్ మ్యానిఫెస్టో విడుదలలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
తిరువనంతపురం, ఏప్రిల్ 2: కేరళ అసెం బ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధి స్తే.. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తామని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీ ఎఫ్) పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తమ పార్టీ మ్యానిఫెస్టోను గురువారం విడుదల చేశారు. విస్తృత సంక్షే మం, అభివృద్ధి, మహిళాసాధికారత లక్ష్యం గా 60 పాయింట్లతో రెండు వాల్యూమ్‌లు గా దీన్ని రూపొందించారు.
మరోపక్క కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మ్యానిఫెస్టో విడుదలలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొ న్నారు. 140 స్థానాలు ఉన్న కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఎల్‌డీఎఫ్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. నెలవారీ పింఛన్ రూ.3 వేలకు పెంపు, అత్యంత పేదరికంలో ఉన్న ఐదు లక్షల కుటుంబాలను ఆదుకోవడం, బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టి, వృద్ధులకు, మంచానపడిన రోగులకు మెరుగైన సంరక్షణ ఇవ్వడం,
చదువు పూర్తి చేసుకున్న విద్యా ర్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు కల్పించడం, నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్లు విస్తరించడం, ‘బ్యాక్ టు క్యాంపస్’ పేరుతో ఉద్యోగం లేని వారికి నైపుణ్యాలు అందించడం, 50 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయింపు, మహిళలు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా సురక్షిత ప్రయాణం, శిశు సంరక్షణ, నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించడం, విద్యావంతులైన వారు చేపట్టే వ్యాపారాలకు వడ్డీలేని రుణా లు అందించడం తదితర హామీలను గుప్పించారు.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృ త్వంలోని యూడీఎఫ్ కూడా ఎన్నికల మ్యా నిఫెస్టోను విడుదలచేసింది. మహిళలకు ఉచి త బస్సు ప్రయాణాలు, సంక్షేమ పింఛను రూ.3,000కు పెంపు, కళాశాల విద్యార్థినులకు రూ.1,000 వంటివి ఉన్నాయి. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.




