పెట్రో కెమికల్స్‌పై ఊరట
- దిగుమతులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం
ఏడాది పాటు అమలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం దేశ పై పడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. తాజాగా కొన్ని కీలక పెట్రో కెమికల్ ఉత్పత్తులకు దిగుమతి సుంకాన్ని మినహాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. దేశీయ పరిశ్రమకు కీలకమైన పెట్రో కెమికల్ ముడిసరకుల లభ్యతకు ఆటంకం కలగకుండా చూడటం, దీనిపై ఆధారపడిన రంగాలపై వ్యయ ఒత్తిళ్లను తగ్గించడం, దేశంలో సరఫరా స్థిరత్వా న్ని కాపాడటం కోసం ఈ చర్యలు చేపట్టామని పేర్కొంది.
అయితే, ఈ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు తాత్కాలికమేనని, దీనివల్ల తుది ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులపైనా అదనపు భారం పడకుండా ఉపశమనం లభిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 20 శాతం కస్టమ్స్ సుంకం విభాగంలో ఉన్న ఉ త్పత్తులపై సుంకాన్ని 12.5శాతానికి, 20- శాతం విభాగంలోని వాటిపై కస్టమ్స్ సుంకా న్ని 15శాతానికి, 30 శాతం విభాగంలోని వాటిపై 20శాతానికి తగ్గించింది. 20 26 ఏప్రిల్1 నుంచి 2027 మార్చి 31 దాకా ఇది అమలులో ఉండనుంది.




