11 August, 2026 | 1:36 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం

21-06-2025 04:53 PM

ఆయుష్ వైద్యాధికారి నీరజ...

మందమర్రి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుని ప్రతిరోజు యోగ సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి నీరజ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక వత్తిడులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అనంతరం యోగాసనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సుమతి, యోగ మాస్టర్ కొంపెల్లి రమేష్ కుమార్, బిజెపి నాయకులు రామటింకి దుర్గరాజు, చంద్రమౌళి, కోలేటి శివ, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.