30 August, 2026 | 12:53 AM

నేను వికెట్ తీస్తానని అనుకోలేదేమో

29-08-2026 11:56 PM

పేద విద్యార్థులకు అండగా ఉంటా: వైభవ్

నాతో బౌలింగ్ రిస్క్ అనుకున్నాడు

ఇషాన్ కిషన్‌పై వైభవ్ వ్యాఖ్యలు

బెంగళూరు, ఆగస్టు 29: భారత్ క్రికెట్ లో చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటర్ గానే అందరికీ తెలుసు. అయితే అతని బౌలింగ్ టాలెంట్ కూడా ఇ టీవలే వెలుగులోకి వచ్చింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంతితోనూ అదరగొట్టాడు. మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న వైభవ్.. కెప్టెన్ ఇషాన్ కిషన్ పై సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ భయ్యా తనకు బంతి ఇవ్వడం రిస్క్ అనుకున్నాడనీ, తాను వికెట్ టేకర్నని అతడికి తెలియదన్నాడు.

తన మనసులో ఒకటే అనుకున్నాననీ, ఐదు వికెట్లు తీసినా నమూడు ఓవర్లే దొరుకుతాయి. అందుకే ఒకే చోట బంతిని కచ్చి తంగా వేయాలని ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు. తన స్పెల్ను వీలైనంత బాగా ముగిం చాలనుకున్నాననీ, గత మ్యాచ్‌లో బ్యాటింగ్ సరిగా సాగలేదన్నాడు. అందుకే బంతితో జట్టుకు సహకరించడం చాలా ఆనందంగా అనిపించిందనీ వ్యాఖ్యానించాడు. ఒక బ్యా టర్ వికెట్ తీస్తే వచ్చే ఆనందానికి మించినది మరొకటి ఉండదని వైభవ్ వెల్లడించాడు. 

ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీ కీలక నిర్ణయం తీసుకున్నాడు.15 ఏళ్ల వయసులోనే గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. ఎక్స్ ఫ్లాట్ఫామ్ వేదికగా వచ్చే ఆదాయాన్ని నిరుపేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తానని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అర్హత కలిగిన విద్యార్థులు సంప్రదించగలరనీ, స్కూల్, కాలేజీ సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయంగా ఉంటానన్నాడు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. నెటిజన్లు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే సేవ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు.