31 March, 2026 | 1:46 AM

తాసీల్దార్ కార్యాలయాల్లో తాయిలాలు!

31-03-2026 12:11 AM

ప్రతి పనికి సప‘రేటు’

సమయపాలన పాటించని అధికారులు

కార్యాలయంలో తిష్ట వేసిన ప్రైవేటు వ్యక్తులు

అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు

పట్టించుకోని ఉన్నతాధికారులు

నాగర్ కర్నూల్ మార్చి 30 ( విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని తహసి ల్దార్ కార్యాలయాల్లో డబ్బులు ఇవ్వనిదే ఏ పని జరగడం లేదని సామాన్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల, ఆదాయ స్థాని క ధ్రువపత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ ముడుపులు చెల్లించాల్సి వస్తోందని మండి పడుతున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్ దగ్గర సుమారు 500కు మించి బలవంతంగా వసూలు చేస్తున్నారని చిన్నచిన్న సాకులు వెతికి రిజిస్ట్రేషన్ చేసేందుకు లక్షల్లో డబ్బు లు గుంజుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్, రెవె న్యూ ఇన్స్పెక్టర్లు, జిపిఓలు ఫీల్ విజిట్, ఉన్నతాధికారులతో మీటింగ్ వంటి కుంటి సాకు లు చెప్తూ కార్యాలయానికి డుమ్మా కొడుతూ సమయపాలన పాటించడం లేదని కార్యాలయాలకు రోజుల తరబడి తిరిగినా ఎవరూ అందుబాటులో దొరకడం లేదని సామాన్య ప్రజలు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో సీటు సాధించిన వి ద్యార్థులు వారి తల్లిదండ్రులు కుల ఆదాయ స్థానిక దృవ పత్రాల కోసం కార్యాలయాలకు రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏ ర్పడిందని మండిపడుతున్నారు.

రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న క్రమంలోనూ ఒక్కో దరఖాస్తుకు 5వేలకు మించి డబ్బులు గుంజుతున్నారని ఇవ్వని వారికి కుంటి సాకులు వెతుకుతూ రిజెక్ట్ కూడా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అచ్చంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఓ కుటుంబానికి ఆరో తరగతి విద్యార్థి ఆర్టీసీ ఉద్యోగం ఉందంటూ సాకు చూపి రేషన్ కార్డును రద్దు చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ రికార్డ్ సెక్షన్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని అందుకోసం ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

తాసిల్దార్ కార్యాలయాల్లో ఆయా గ్రామ పంచాయతీలోని ఆయా పార్టీ కార్యకర్తలు నాయకులు తిష్ట వేసి ఆయా గ్రామాల నుం చి వచ్చిన ప్రజలకు మాయ మాటలతో న మ్మించి పని కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ మధ్యవర్తిత్వం వహించి పను లు జరిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ నుండి తప్పించుకోవడం కో సం తాసిల్దార్ కార్యాలయంలోని అధికారు లు ఇలా ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీఆర్‌ఏ ఇతర సిబ్బంది వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను ఇతర ప్రైవేటు వ్యక్తులతో పనులు జరిపిస్తున్నారని బాహాటంగా ఆరోపణలు ఉన్నాయి.

ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి హాజరు కావలసిన అధికారులు మిట్ట మధ్యాహ్నం 12 ఒంటిగంటకు తాపీగా కార్యాలయానికి వచ్చి తమపై దర్బార్ ప్రదర్శిస్తున్నారని కిందిస్థాయి సి బ్బంది మండి పడుతున్నారు. నాగర్ కర్నూ ల్ తాసిల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని అయినా ఉన్నతాధికారులు కూడా అంటి ముట్టనట్లు వ్యవహరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు నచ్చిన వ్యక్తుల చేత ప్రభుత్వ కార్యాలయ ప నులు కూడా జరిపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాహాటంగా విమర్శలు గుప్పుమంటున్నాయి. కొల్లాపూర్ తాసిల్దార్ కార్యా లయంలో అటెండర్ కంప్యూటర్ ఆపరేటర్ ఇతర సిబ్బంది చేత ముడుపులు అందుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తాసిల్దార్ సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్లు బంద్.

ఆయా మండల తాసిల్దార్లు వైద్య పరమైన లేదా ఇతర సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్ లను పూర్తిగా మరుసటి రోజుకి బదిలీ చేస్తూ ఆరోజు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో రైతు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాసిల్దార్ లేని సమయంలో డిప్యూటీ తాసిల్దార్ రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది కానీ అక్రమ మార్గాన సంపాదించే కొంతమంది తాసిల్దారులు ఆరోజు రిజిస్ట్రేషన్ లను నిలిపివేయడం విశేషం.

ఆన్లైన్ కేంద్రంగా జరుగుతున్నప్పటికీ క్రయవిక్రయాల విషయంలో ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు భావిస్తున్నాయి. క్రయ విక్రయాలు జరిగే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని దూరప్రాంతాల నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతు లు మండి పడుతున్నారు. 

 విచారించి చర్యలు తీసుకుంటాం

 ప్రస్తుతం అన్ని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో హాజరు విషయంలో హెచ్చరికలు జారీ చేశాం. సమయపాలన పాటించని తాసిల్దార్లకు జీతం నిలుపుదల చేస్తామని చెప్పాము. తహసిల్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు లావాదేవీలు జరిపితే క్రిమినల్ చర్యలు ఉంటాయి. రైతులు సామాన్యులు ఎవరు ఇతరులకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. డబ్బులు డిమాండ్ చేసిన వారి పేర్లు వివరాలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు సృష్టించినా శాఖా పరమైన చర్యలు ఉంటాయి.

 అమరేందర్, జిల్లా అదనపు కలెక్టర్, నాగర్ కర్నూల్.