31 March, 2026 | 1:59 AM

రేషన్ కార్డుల ఏరివేత

31-03-2026 12:25 AM
  1. అనర్హులకు రేషన్ కట్

జిల్లాలో 3,35,351 మంది లబ్దిదారులు 

14,264 మంది అనర్హులుగా గుర్తింపు 

సిద్దిపేట, మార్చి 30 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో రేషన్ కార్డులపై ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలో మొత్తం 3 లక్షల 35 వే ల 351 రేషన్ కార్డులు ఉండగా, వీటిలో సు మారు 14 వేల 264 పైచిలుకు కార్డులు అనర్హులవిగా గుర్తించినట్లు అధికార వర్గాలు వె ల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం అర్హుల జాబితాను ఖరారు చేయడానికి గుర్తించిన అనర్హుల ఇం టింటి సర్వే ప్రారంభించింది.

ప్రభుత్వం అమ లు చేస్తున్న తాజా నిబంధనల ప్రకారం, సంవత్సరానికి రూ.6 లక్షలకు పైగా ఆదా యం ఉన్న వారు, 2.20 ఎకరాలకు మించిన వ్యవసాయ భూమి కలిగిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులు, అలాగే ప్రైవేట్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నవారు రేషన్ కార్డు అర్హత కోల్పోతారు. ఈ ప్రమాణాల ఆధారంగా అధికారులు లబ్ధిదారుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు.ఈ చర్యల వెనుక ముఖ్య ఉద్దేశ్యం నిజమైన అర్హులకు న్యాయం చేయడం. అనర్హులు రేషన్ బియ్యాన్ని పొందడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందని అ ధికారులు చెబుతున్నారు.

ఒకవైపు అర్హులు సరైన లబ్ధి పొందకుండా ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు అనర్హులు సబ్సిడీ బి య్యాన్ని అక్రమంగా వినియోగించడం వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది.జిల్లాలో రేషన్ బియ్యం దందా మూడు పూలు ఆరు కాయలు అన్నట్టుగా కొనసాగుతున్నదానికి పలు కారణాలు ఉన్నాయి. కొంతమంది రేషన్ డీలర్లు, మధ్యవర్తులు కలిసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు మళ్లించడం, అర్హత లేని కార్డులను కొనసాగించడం, పర్యవేక్షణలో లోపాలు వంటి అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

అదనంగా, లబ్ధిదారుల డేటా సకాలంలో అప్డేట్ కాకపోవడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేసింది.జిల్లాలో అనర్హులుగా గుర్తించిన వారికి ఇంటింటి సర్వే ద్వారా ఈ లోపాలను సరిదిద్దే ప్రయ త్నం జరుగుతోంది. అధికారులు ప్రతి కు టుంబం యొక్క ఆదాయం, ఆస్తులు, వృత్తి వంటి వివరాలను పరిశీలించి అర్హతను నిర్ణయిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో నిజమైన అర్హులు అన్యాయంగా బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డుల తొలగింపు వల్ల అర్హులు నష్టపోతే వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

అందువల్ల పారదర్శకతతో సర్వే చేయాలని ప్రజలు కోరుతున్నారు. అనర్హులను తొలగించడం ద్వారా ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయి నిజమైన పేదలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి, సిద్దిపేట జిల్లాలో రేషన్ కార్డులలో అనర్హులను ఏరివేసే కార్యక్రమం కీలక దశలో ఉంది. ఈ ప్రక్రియ సక్రమంగా అమలు అయితే అర్హులకు న్యాయం జరిగి, అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. 

పారదర్శకంగా సర్వే

రాష్ట్ర ప్రభుత్వం 14,264 మంది అనర్హులు రేషన్ కార్డులు కలిగి ఉన్నారని గుర్తించి నివేదిక పంపించింది. అనర్హుల జాబితా ఇప్పటికే మండల కేంద్రాలకు పంపించాము. అనర్హుల ఎరివేతలో భా గంగా నిర్వహించే సర్వే పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించాం. త్వరలోనే సర్వే ముగించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం.

తనూజ, జిల్లా సివిల్ సప్లై అధికారి, సిద్దిపేట