26 June, 2026 | 1:46 AM

గోదావరి వరదల నివారణకు శాశ్వత రక్షణ చర్యలు

26-06-2026 12:00 AM
  1. పేదల విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం 
  2. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ 
  3. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క

ములుగు (మహబూబాబాద్) జూన్ 25 (విజయక్రాంతి): గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఏటా సంభవించే వరదల కారణంగా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రజల భద్రత, విద్యార్థుల సంక్షేమాని కి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

గురువారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవా రి ఘనపూ ర్ ప్రభుత్వ గిరిజన బాలికల వ సతి గృహాన్ని మంత్రి అనసూయ సీతక్క కలెక్టర్తో కలిసి సందర్శించి, రామన్నగూడెం వద్ద గోదావరి నది కరకట్ట భద్రత కోసం నూతన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న జియో ట్యూబ్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన ప్రతి సంవత్సరం గోదావరి వరదల ప్రభావంతో ఏటూరునాగారం, రామన్నగూడెం, మంగపేట, అకినేపల్లి మల్లారం, ఓడగూడెం తదితర ప్రాంతా ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

గత 10 నుండి 15 సంవత్సరాలుగా పెండిం గ్లో ఉన్న గోదావరి రక్షణ పనులను ప్రజా ప్ర భుత్వం ప్రాధాన్యతగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలతో పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. మంగపేట, రామన్నగూడెం ప్రాం తాల్లో వరద ఉధృతి గ్రామాలపై ప్రభావం చూపకుండా దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో జియో ట్యూబ్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిమిత ప్రాంతాల్లో అ మలు చేస్తున్న తరుణంలో తొలిసారిగా ము లుగు నియోజకవర్గంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మంగపేట ప్రాంతంలో కరకట్ట నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, రామన్నగూడెం వద్ద కూడా అదే తరహాలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అధికారులు నిరంత రం అప్రమత్తంగా ఉండి వరద పరిస్థితులపై పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

అనంతరం మంత్రి  సీతక్క, జిల్లా కలెక్టర్, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, అందిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీ లించారు. విద్యార్థులకు ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపే ప్రజా సమస్యలను తొలగించడానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. రాజుపేట లో మంగపేట మండల పరిధిలో ని గ్రామాలకు చెందిన ప్రజల నుంచి ప్రజాదర్బార్ కార్యక్రమంలో దరఖాస్తులను స్వీక రించారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. అలాగే మంగపేట మండల కేంద్రంలో 150 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న మండల ఆఫీస్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పిరంగి, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, ఐబీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కమిటీల చైర్మన్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.