26 June, 2026 | 1:46 AM

నాగోల్‌లో మహిళ అదృశ్యం

26-06-2026 12:00 AM

ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన

నాగోల్, జూన్ 25 (విజయక్రాంతి): నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం, తట్టి అన్నారం జి.వి.ఆర్. కాలనీకి చెందిన మహమ్మద్ షరీఫ్ ఖాన్ షా తన భార్య షరీఫ్ మిరాజ్ అలియాస్ మెహర్నిషా (49) కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన మెహర్నిషా తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన నాగోల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళ ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మెహర్నిషా గురించి ఎవరైనా సమాచారం తెలిసినట్లయితే సమీప పోలీస్ స్టేషన్ను లేదా నాగోల్ పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712662751ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.