రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత
ట్రాక్టర్-బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి
పాపన్నపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో శుక్రవారం రాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. అబ్లాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి బాల్ రాజు(30) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లిలో ఫంక్షన్ కు హాజరై సాయంత్రం సమయంలో తన బైక్ పై తిరిగి ఇంటికి వస్తుండగా అన్నారం గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బాల్ రాజు ప్రయానిస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బాల్ రాజు కిందపడగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.






