calender_icon.png 23 December, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

23-12-2025 10:56:28 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అతివేగంతో వెళ్లిన వ్యక్తి అదుపుతప్పి కింద పడిపోయినట్లు స్థానికులు తెలుపుతున్నారు. గాయపడ్డ వ్యక్తి పంబపూర్ గ్రామస్థుడిగా గుర్తించారు. అతివేగంతో వెళ్లడంతోనే ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయి గాయాలైనట్లు స్థానికులు తెలుపుతున్నారు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు.