calender_icon.png 23 December, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్రేశంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

23-12-2025 10:54:07 AM

అధికారులు కాసులకు కక్కుర్తిపడి నిబంధనలను బేఖాతర్

పటాన్ చెరు: నిబంధనలు తుంగలో తొక్కుతూ పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీ, ఇద్రేశంలో  ప్రతి కాలనీలో ఇష్టారాజ్యాంగ కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు అధికారుల దృష్టికి రాకుండా కింది స్థాయి సిబ్బంది కొంత మంది నాయకుల అండతో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని నిర్మాణాలపై వారికి ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

మళ్లీ అటువైపు చూడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుంది, సరైన పద్ధతిలో ప్రభుత్వానికి రుసుముల చెల్లించి అనుమతులు పొంది తర్వాత చేపట్టాల్సిన నిర్మాణాలు కొందరు ముందుగానే పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు చేపడుతున్నారు.మరికొందరు జీ+2 అనుమతులు పొంది 4, 5, 6 అంతస్తులను నిర్మిస్తున్నారు.కొందరు కిందిస్థాయి అధికారులు కాసులకు కక్కుర్తిపడి నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు.నిర్మాణాలు అధికారుల సమస్వయంతోనే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి అనుమతులు పొందకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.