మహాసభలను జయప్రదం చేయండి
15-07-2026 07:14 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) జిల్లా మాసభలు జూలై 25, 26 తేదీలలో నిర్వహిస్తున్నట్టు సంఘ నాయకులు తెలిపారు. ఇంద్రానగర్‌లోని TAGS జిల్లా కార్యాలయంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) నిర్మల్ జిల్లా కార్యదర్శి తొడస శంభు మాట్లాడుతూ, జిల్లాలోని ఆదివాసులు, గ్రామ పెద్దలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గేడం విష్ణు, కాతలే లక్ష్మణ్, పంద్రా నాగోరావు, గేడం అర్జున్, పంద్రా విజయ, గేడం సాంబాయి, కుమరం మోతుబాయి, గేడం లలిత బాయి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






