09-12-2025 04:29:00 PM
నిర్మల్ (విజయక్రాంతి): దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆఫీస్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం వినతిపత్రం అందించారు. విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా వారి బాధలను విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం సంఘ భవనం కావాలని, అంత్యోదయ కార్డులు జారీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 6 వేలు పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఇందులో సట్టి సాయన్న, ఇసాక్ అలీ, భగవాన్, సత్య నారాయణ, వెంకటేష్, భూమేష్ తదితరులు ఉన్నారు.