09-12-2025 04:25:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అయ్యప్ప క్షేత్రం మల్లన్న గుట్ట సుబ్రమణ్య స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు గిరి ప్రదర్శన నిర్వహించారు. అభిషేక పూజ కార్యక్రమాలను చేపట్టగా ఆలయ వ్యవస్థాపకులు అల్లల్ల వినోద మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు నవయుగమూర్తి వేణుగోపాల్ అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.