13 May, 2026 | 4:43 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

గ్రూప్-1 వాయిదాకు పిటిషన్లు

19-10-2024 01:40 AM

21న విచారించనున్న సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్షల నిర్వహణలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా అమ లు చేయలేదని దాఖలు చేసిన ఈ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టా లని అభ్యర్థుల తరపు న్యాయవాది మోహిత్‌రావు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని శుక్రవారం అభ్యర్థించారు.

తక్షణమే పిటిషన్‌ను విచారణ చేపట్టలేమని, ఈ నెల 21వ తేదీ సోమవారం విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఢిల్లీ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సో మవారం సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఉత్తర్వులు జారీచేసేవరకు తెలం గాణ సర్కార్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.