29-07-2025 01:23:40 AM
అదనపు కలెక్టర్‌లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం, జూలై 28 (విజయ క్రాంతి): ప్రజావాణి అర్జీలను పరిశీలించి సత్వరమే పరి ష్కరించాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లు సంబంధిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజలు సమర్పించిన అర్జీలను అదనపు కలెక్టర్ లు స్వీకరించారు.
జిల్లాలోని పళ్ళు మండలాలకు చెందిన పలువురు హాజరై వారి వారి సమస్యల పరి ష్కారం కోసం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులు తగు చర్య లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ పద్మశ్రీ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా అధికారు లు, కలెక్టరేట్ ఏఓ. కే. శ్రీనివాసరావు, తదితరులుపాల్గొన్నారు.