29-07-2025 01:25:46 AM
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, జులై 28, (విజయక్రాంతి) ఎన్నికల హామీ మేరకు తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నం బియ్యం పంపిణి పథకం అమలు చేయడాన్ని హర్షిస్తున్నామని, సన్నబియ్యం నాణ్యతను మరింత పెంచి పేదలు కడుపునిండా తిండి తినేలా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.
చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాలకు సంబందించిన లబ్దిదారులకు మంజూరైన తెల్ల రేషన్ కార్డులకు సోమవారం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని, కొత్త రేషన్ కార్డుల జారీతో చేతులు దులుపుకుంటే సరిపోదని, తక్షణమే బియ్యం కేటాయింపు జరగాలన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిత్యావసరాల పంపిణి చేపట్టాలని సూచించారు. ని యోజకవర్గ వ్యాప్తంగా 8000మంది కుటుంబ సభ్యుల చేర్పింపుతో 4500 కొత్త రేషన్ కార్డులు లబ్దిదారులకు అందిస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు పాత రేషన్ కార్డుల్లో 8000 మంది చేర్పింపు జరిగిందన్నారు. కార్డుల ప్రక్రియ నిత్య ప్రక్రియలా కొనసాగేలా ప్రభుత్వంపై వత్తిడి తెస్తానని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అర్హులైన ప్రతి పెద్దకుంటుంబాని అందేలా చొరవతీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, చుంచుపల్లి, డిఎస్‌ఓ రుక్మిణి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్లు రామకృష్ణ, ప్ర సాద్, శిరీష, ఎంపిడివోలు శుభాసీని, భారతి, అంకుబాబు, హన్మంతరావు,ఎస్ కె సాబీర్ పాషా, దస్రు, కుమారి హన్మంతరావు, వాసిరెడ్డి మురళి, దీటి లక్ష్మిపతి, జక్కుల రాములు, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, తాళ్ల వెంకటేశ్వర్లు, పొలమూరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, తూము చౌదరి, చింతలపూడి శేఖర్, ధర్మారావు, గోపి తదితరులు పాల్గొన్నారు.