calender_icon.png 30 July, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

29-07-2025 01:22:34 AM

అదరపు కలెక్టర్ వేణుగోపాల్ 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 28, (విజయక్రాంతి)ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వర మే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి వే ణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సో మవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అ న్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించా రు.

జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులుపాల్గొన్నారు.