3 April, 2026 | 1:53 AM

పింఛన్‌లో చిల్లర దోపిడీ

03-04-2026 12:00 AM

పింఛన్‌లో రూ.16 ఫట్  

చిల్లర లేదంటూ ఎగవేత

పోగేసుకుంటున్న పోస్ట్ మాస్టర్ లు

పిక్స్ డ్ డిపాజిట్ లను పిండుతున్న పోస్టల్ సిబ్బంది 

సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారుల వేడుకోలు.

తుంగతుర్తి, ఏప్రిల్ 2 : పేదల బతుకులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంటే.. వాటిని పంపిణీ చేయాల్సిన సిబ్బంది చిల్లర లేవనే సాకుతో రూ.2016, 4016 లోని పై రూ.16ను జేబులో వేసుకుంటున్నట్లు లబ్ధిదారులు చె బుతున్నారు. ఎవరో ఒకరు, ఇద్దరి వద్ద అం టే సమయానికి లేవు అనుకోవచ్చు కానీ ప్రతి వారికి, ప్రతి సారి ఇలానే చెబుతూ పో స్టల్ సిబ్బంది ఈ చిల్లరను పోగేసుకుని తమ జేబులు నింపుకుంటున్నారు అనే అభియోగాలు వస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వం పేదలకు అందించే పింఛలలో ’చిల్లర’ దోపిడీ జరుగుతున్నట్టు తెలుస్తుంది.

 అన్నారంలో అయోమయం : 

జిల్లాలోని తుంగతుర్తి మండలం అన్నా రం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 800వందల పై చిలుకు ఫించన్ దారులు, ప్రతినెల పింఛన్లు తీసుకుంటున్నా రు. వారికి వచ్చే పింఛన్ రకాన్ని బట్టి ఒకొక్కరికి రూ.2016, రూ.4016లు పంపిణీ చేయాల్సి ఉండగా సంబంధిత పోస్టల్ అధికారి కొందరికి రూ.16లు ఇవ్వకపోవడం, మరికొందరికి రూ.6ల చిల్లర లేవని ఎగవేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే కొందారు నెల నెల దాచుకునే పిక్సీడ్ డిపాజిట్ డబ్బులు గడువు ముగిసి రెండు సంవత్సరాలు పూర్తయిన నేటి వరకు వారి కుటుంబానికి డబ్బు లు అందించకపోవడంతో కుటుంబ సభ్యులు అయోమయపడుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా అన్నారం గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ కనీసం పింఛన్ దారుల పాస్ బుక్ లు కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు.   వేలల్లో ఎగవేత :   ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో పింఛన్ లబ్ధిదారులు ఉన్నందున వారి నుండి ప్రతినెల చిల్లర పేరిట వేల రూపాయలు మిగిలించుకుంటున్నారని ఆరోపణలు జోరుగా మండలంలో వినిపిస్తున్నాయి.

దీనితో మొత్తం మండలంలో ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఫించన్ దారులు నష్టపోతున్నట్లు సమాచారం. ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయంను గ్రామా ల్లో ప్రశ్నించే వారే లేకపోయారు. జరుగుతున్న మోసాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పేద పింఛన్ దారులకు అన్యాయం జరగకుండా పింఛన్ పంపిణీదారులపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా ఇదే విషయంపై స్థానిక సర్పంచ్ సంబంధిత అధికారికి విచారణ చేపట్టాలని కోరుతూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

డబ్బులు ఇస్తలేరు 

గడిచిన 33 నెలలుగా అన్నారం పోస్ట్ ఆఫీస్ లో నెల నెల డబ్బులు దాచుకున్నాను. 2024 లోనే ఎఫ్డి పూర్తయింది. నేటి వరకు కూడా ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, నా పుస్తకం, నా డబ్బులు ఇస్తలేరు. నాకు ఆరోగ్యం బాగాలేదు డబ్బులు అవసరం ఉన్నది. అధికారులు నాకు డబ్బులు ఇప్పించాలి.

వీరబోయిన యాదమ్మ అన్నారం

అవకతవకలపై విచారణ జరిపించాలి

గడిచిన కొద్దిరోజులుగా గ్రామంలో పింఛన్ల పంపిణీలో అవక తవకలు జరుగుతున్నాయి. ఈ విష యం గురించి జిల్లా పోస్టల్ ఉన్నత అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ, నేటి వరకు కూడా వచ్చి విచారణ చేపట్టలేదు. పిక్సీడ్ డిపాజిట్ గడువు ముగిసినాక కూడా డబ్బులు నేటి వరకు ఇవ్వకపోవడం దారుణం. జిల్లా పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు , పోస్ట్ మాస్టర్ అవకతవకలు పై తక్షణమే విచారణ చేపట్టాలి. అవకతవకలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

మట్టిపల్లి వెంకట్, అన్నారం

లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం    

ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తాం. నిజమని తేలి తే సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం.

బుచ్చిబాబు, జిల్లా పోస్టల్ అధికారి