3 April, 2026 | 1:49 AM

పటాన్‌చెరులో ఉద్రిక్తత

03-04-2026 12:00 AM

* కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసం వద్ద పోలీసుల ముట్టడి

పటాన్ చెరు, ఏప్రిల్ 2: మీడియా సమావేశంలో సవాల్ ప్రకారం గురువారం ఉదయం బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించి న కాంగ్రెస్నేత కాటా శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుం చే ఆయన నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఇంటిని ముట్టడించారు.

కాటా శ్రీనివాస్ గౌడ్ శివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ముందుగానే అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. చర్చకు వెళ్లకుండా తమను గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాట శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.