18 June, 2026 | 1:55 AM

విద్యార్థుల సౌకర్యానికి దాతృత్వం

18-06-2026 12:35 AM

పాఠశాలలో మరుగుదొడ్లకు కొత్త రూపు

హుజూర్ నగర్, జూన్ 17: మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం దాత నారాయణరావు దేశ్ముఖ్ సుమారు రూ.45 వేల వ్యయంతో పాఠశాలలోని ఆరు మరుగుదొడ్లను మరమ్మతు చేయించి, వాటికి కొత్త డోర్లు అమర్చించారు. అలాగే పాత కమ్మోడ్ల స్థానంలో కొత్త కమ్మోడ్లను ఏర్పాటు చేసి వినియోగానికి అనుకూలంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

ఈ సందర్భంగా తమ పాఠశాలలో మరుగుదొడ్లకు కొత్త రూపు అందించిన నారాయణ రావు దేశ్ముఖ్ను పాఠశాల హెడ్ మాస్టర్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. బూరుగడ్డ గ్రామంలో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి నారాయణ రావు దేశ్ముఖ్ మరిన్ని సేవలు అందించాలని గ్రామస్తులు కోరారు.విద్యాసంస్థల అభివృద్ధికి నారాయణ రావు దేశ్ముఖ్ అందిస్తున్న సహకారం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.