పీఎంవో నుంచి రాంచందర్‌రావుకు ఫోన్
11-05-2026 02:32 AM
సభ సక్సెస్‌తో సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుకు ఫోన్ వచ్చింది. ఆదివారం సికింద్రాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభపై ఆయనకు అభినందనలు తెలిపినట్లు తెలిసింది. సభ నిర్వహణ, ఏర్పాటు, విజయవంతంపై ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేసినట్లు రాంచందర్‌రావుకు పీఎంవో అధికారులు తెలిపారు. ఇదే జోష్‌ను కొనసాగించాలని రాంచందర్‌రావుకు పీఎంవో సూచించినట్లు తెలిసింది.






