భగవద్గీత కంఠస్థ పఠనంలో గోల్ మెడల్ సాధించిన సమత దేవి
11-05-2026 02:30 AM
కేసముద్రం, మే 10 (విజయక్రాంతి): భగవద్గీత కంఠస్థ పఠనం పరీక్షలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన ఓలం సమతా దేవి గోల్ మెడల్ సాధించారు. మైసూరు దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో సమతా దేవి పాల్గొన్నారు. ఈ మేరకు సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి చేతులమీదుగా సమతా దేవి గోల్ మెడల్, ప్రశంసా పత్రాన్ని సచ్చిదానంద స్వామి ఆశీర్వాదాన్ని అందుకున్నారు.






