11 May, 2026 | 5:16 AM

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

11-05-2026 02:33 AM

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందృ నాయక్ 

మరిపెడ (మహబూబాబాద్) మే 10 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిలువ నీడలేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సొంతింటి కలను నిజం చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామంలో బాషిపంగు సురేష్ నూతన గృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్  మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం కావాలనే మహోన్నత లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది.

ఇందిరమ్మ ఇల్లు పథకం పేదలకు వరంలా మారింది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వేలాది కుటుంబాలు ఇల్లు పొందగా, ఇప్పుడు కూడా అదే సంకల్పంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేద ప్రజల ఆశయాలు, అవసరాలు తెలుసుకుని వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు కాదని, అది ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు బలమైన పునాది అన్నారు.

అలాంటి ప్రతి కుటుంబానికి అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమే  గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి, గిరిపురం సర్పంచ్ నీల సైదులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ముఖ్య నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.