22 June, 2026 | 3:35 PM

Breaking News

తిప్పారం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం   •   బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •  

ఫిజియోథెరపీ మంచిది!

23-03-2025 12:00 AM

ప్రమాదం లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా చలనం కోల్పోయిన అవయవాల్లో కదలికల కోసం ఫిజియోథెరఫీ చేస్తుంటారు. అలాగే నడుము, మెడ, భుజాలు, ఆర్థరైటిస్ నొప్పులు దీర్ఘకాలం వేధిస్తున్నా వాటి నుంచి ఉపశమనం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు. 

ప్రయోజనాలు

* ప్రమాదాలు, పక్షవాతం కారణంగా కదల్లేని స్థితికి చేరుకుని నడవాలన్నా, లేవాలన్నా ఇతరులపై ఆధారపడతారు. వీరు రోజుల తరబడి మంచానికే పరిమితం కావడం వల్ల కండరాలు బలహీనంగా మారతాయి. వీరిలో కండరాలు తిరిగి బలోపేతం కావడానికి ఫిజియోథెరపీ సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. 

* ఎముకలు విరగడం, చేతులు, కాళ్లను కదలించలేని, నడవలేని పరిస్థితులలో ఉన్నవారు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకుంటే ఒకట్రెండు నెలల్లోపే ఫలితం కనిపిస్తుంది. 

* తలపై దెబ్బతగిలినా, బ్రెయిన్ డ్యామేజ్ అయినా, వెన్నెముక దెబ్బతిన్నా, చేతులు, కాళ్లు సరిగా కదపలేకపోయినా క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ వ్యాయామాల వల్ల ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.