22 June, 2026 | 2:21 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

పాలపై అనుమానాలా?

23-03-2025 12:00 AM

పాలు సంపూర్ణ ఆహారం. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన చక్కెర, ప్రొటీన్, కొవ్వులన్నీ దీంతో లభిస్తాయి. బియ్యంలో లేని లైసిన్, త్రియానైన్ అనే అమైనో ఆమ్లాలూ దీంతో భర్తీ అవుతాయి. చిన్నప్పటి నుంచే పాలు తాగడం అలవాటు చేసుకుంటే జీవితాంతం మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయినా మనలో చాలామందికి పాలపై ఎన్నో అపోహలు, భయాలున్నాయి. వీటిని తొలగించుకోవడం మంచిది.

పాలు జీర్ణం కావన్నది కొందరి భయం. ఆవు పాలలో ప్రొటీన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి తేలికగానే జీర్ణమవుతాయి. గేదె పాలలో ప్రొటీన్ కాస్త ఎక్కువ. అయినా కూడా తేలికగానే జీర్ణమవుతాయి. ఫైబర్ ఫుడ్ తీసుకోలేనివారికి, ఆహారం సరిగా జీర్ణం కానివారికి పాలు, పెరుగు, మజ్జిగ ఎంతో మేలు చేస్తాయి. 

ప్యాకెట్ పాలు మంచివి కావనేది నిజం కాదు. డెయిరీల్లో పాలను ముందుగానే శుభ్రం చేసి, కొవ్వుశాతం సమానంగా ఉండేలా చేస్తారు. కొద్దిసేపు అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేసి, ఆ వెంటనే చల్లబరుస్తారు. దీంతో బ్యాక్టీరియా వంటివేవైనా ఉంటే చనిపోతాయి. అంటే ప్యాకెట్ పాలు సురక్షితమన్న మాట. పోషకాలేమీ తగ్గవు. 

పాలతో బరువు పెరుగుతామన్నది మరికొందరి అపోహ. మితంగా తీసుకుంటే వీటితో ఇబ్బందేమీ ఉండదు. అయితే చిక్కటి పాటు, గడ్డ పెరుగు వంటివి ఎక్కువెక్కువగా తీసుకుంటూ.. వ్యాయామం, శారీరక శ్రమ చేయకపోతే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం లేకపోలేదు. 

పాలు తాగితే జలుబు చేస్తుందని అనుకోవటం భ్రమే. నిజానికి పాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది.