బొమ్మ బొమ్మ..
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీ శ్రీ’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు రవి నెలకుదిటి తెరకెక్కిస్తున్నారు. ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తొలిపాట ‘బొమ్మ బొమ్మ’ను మేకర్స్ విడుదల చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపర్చిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, కపిల్ కపిలన్ పాడారు.
ఈ పాటలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అనయ్ ఓం గోస్వామి; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.






