4 July, 2026 | 10:37 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఇసుక వాగు బ్రిడ్జిని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం

20-06-2025 12:00 AM

అశ్వాపురం, జూన్ 19 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గొందిగూడెం గ్రామం నుండి అశ్వాపురం మధ్య గల ఇసుక వాగుపై సుమారు రూ7 కోట్ల  వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి , రోడ్డును గురువారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు బ్రిడ్జి పనులను కాసులకు కక్కుర్తి పడి ,కాంట్రాక్టర్లకు లాభాలు చేరుకునే విధంగా పనులలో జాప్యం చేశారనీ, నేడు ప్రజా ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం బ్రిడ్జి పనులను వేగవంతంగా జరిపి వచ్చే వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, మాజీ ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ , మాజీ సర్పంచ్ పాయం భద్రమ్మ , నెల్లిపాక సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి , ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.