13వ వార్డులో పైప్‌లైన్ పనులు ప్రారంభం
31-07-2026 12:00 AM
కౌన్సిలర్ గడ్డం లక్ష్మీవెంకట్ రెడ్డి
మొయినాబాద్ జూలై 30 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ని సురంగల్ 13వ వార్డులో మంచినీటి స మస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పైప్లైన్ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గడ్డం లక్ష్మీవెంకట్ రెడ్డి మాట్లాడుతూ, వార్డు ప్రజలకు తా గునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్డు అభివృద్ధి పనులను దశలవారీగా చేపడతామని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం వెంకట్ రెడ్డి, విక్రంరెడ్డి, మహబూబ్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






