ఎమార్వో ఆఫీస్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ఘట్ కేసర్, జూలై 30 (విజయక్రాంతి): ఘట్కేసర్ తహసీల్దార్ కార్యాలయం ను మే డ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాదాబైనామా, భూ భారతి పెండింగ్ అప్లికేషన్లు, గ్రామాల రీసర్వే, ఎలక్ట్రోల్ ఎన్రోల్మెంట్ (సర్) లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదా బైనామా, భూ భారతి పెండింగ్ అప్లికేషన్లను, గ్రామాల రీసర్వే, ఎలక్ట్రోల్ ఎన్రో ల్మెంట్ (సర్) పరిశీలించి పెండెన్సి త్వరితగతిన పూర్తి చేయాలని తహాసీల్దారును ఆదే శించారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూమి రికార్డుల సమగ్ర పోర్టల్ భూభారతిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సూచనలు జారీ చేశారు. పెండిం గ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండెన్సికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామా, భూభారతి రికార్డులను అదనపు కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సర్ ప్రక్రియలో భాగంగా డి జిటలైజేషన్ నిర్ణీత గడువులోగా పూర్తి చే యాలన్నారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.






