15 July, 2026 | 6:17 PM

Breaking News

వాసవి వరల్డ్ విద్యార్థి ప్రతిభ   •   తాడిచర్ల–2 బ్లాక్ విజయోత్సవంలో సింగరేణి డైరెక్టర్ పి&పి కె.వెంకటేశ్వర్లు   •   ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమస్యలు చెప్పండి   •   మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ   •   నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ   •   ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ   •   విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..   •   నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   తెయూకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు   •  

ఈ కామర్స్ వృద్ధిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆందోళన

21-08-2024 04:57 PM

ఢిల్లీ: దేశంలో ఈ కామర్స్ వేగంగా అభివృద్ధి చెందడం ఆందోళన కరమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఉద్యోగ కల్పన,  వినియోగదారుల సంక్షేమం పై ఈ కామర్స్ ప్రభావం అనే నివేదిక విడుదల సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కామర్స్ నెట్ వర్క్ వల్ల రాబోయే పదేళ్లలో సగం మార్కెట్ అవే ఆక్రమించడాన్ని విజయంగా భావించొద్దన్నారు. పోటీ నివారించేందుకు అనుసరిస్తున్న ధరల విధానం వల్ల సాంప్రదాయ రిటైల్ మార్కెట్ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద ఈ కామర్స్ సంస్థల వ్యాపార వ్యూహాలపై ఆయన వ్యాఖ్యానించారు. బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారంటే అవి భారత్ ఆర్థక వ్యవస్థకు అండగా నిలిచేందుకు కాదని అర్థం చేసుకోవాలన్నారు. తమ బ్యాలెన్స్ షీట్లో నష్టాలను భర్తీ చేసుకోవడానికే అన్నారు. వాస్తవానికి అవి బిజినెస్ టు కస్టమర్ వ్యాపారాన్ని నిర్వహించకూడదు, కానీ అందరం ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్ లపై కొనుగోలు చేయడానికి అలవాటు పడిపోయామని ఆయన తెలిపారు. పెద్ద పెద్ద రిటైలర్ల వల్ల చిన్న రిటైలర్లు మాయమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.