భారత యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి
21-08-2024 05:31 PM
ఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం గగన తలంలో ఉండగా అనుకోని పరిస్థితి ఎదురైంది. అందులో నుంచి సామగ్రి జారిపడిందని ఐఏఎఫ్ వెల్లడించింది. సాంకేతిక లోపమే ఇందుకు కారణమని తెలిపింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా లో పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సామగ్రి జారిపడిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొంది.దీనిపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది. కాగా ఎయిర్ స్టోర్ పడినపుడు పెద్ద శబ్దం వినిపించడంతో .. ఏం జరిగిందో తెలుసుకునేందుకు దగ్గర్లోని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ సామాగ్రి ఏంటి అన్న విషయం వెల్లడించ లేదు.






