9 May, 2026 | 9:46 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ముగిసిన పీకేఎల్ వేలం

17-08-2024 12:00 AM

సచిన్ తన్వర్‌కు అధిక ధర

ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ కోసం జరిగిన వేలం శుక్రవారం ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన వేలంలో పలువురు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు గుమ్మరించాయి. మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించి వేలం నిర్వహించగా.. ఎ రూ.30 లక్షలు, బి రూ. 20 లక్షలు, సి రూ. 13 లక్షలు, డి రూ. 9లక్షలుగా నిర్ణయించారు.

ఇక వేలంలో సచిన్ తన్వర్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్‌ను తమిళ్ తలైవాస్ రూ. 2.15 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఇరాన్ స్టార్ ప్లేయర్ చియానేను హర్యానా స్టీలర్స్ దక్కించుకుంది. తెలుగు టైటాన్స్ పవన్ షెరావత్‌ను రిటైన్ చేసుకోగా.. గతంలో అధిక ధరకు అమ్ముడైన రాహుల్ చౌదరి, రోహిత్ గులియా అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం గమనార్హం.

అధిక ధర పలికిన టాప్ ఆటగాళ్లు 

సచిన్ తన్వర్         రూ. 2.15 కోట్లు (తమిళ్ తలైవాస్)

చియానే         రూ. 2.07 కోట్లు (హర్యానా స్టీలర్స్)

గుమన్ సింగ్         రూ. 1.97 కోట్లు (గుజరాత్ జెయింట్స్) 

పవన్ షెరావత్ రూ. 1.72 కోట్లు (తెలుగు టైటాన్స్)

భరత్         రూ. 1.30 కోట్లు (యూపీ యోధాస్)