29 June, 2026 | 12:52 AM

రెండుదేశాల్లో హెలికాప్టర్ ప్రమాదాలు

29-06-2026 12:25 AM

25 మంది దుర్మరణం

సౌదీలో 14, ఫ్రాన్స్‌లో 11 మంది మృతి

ప్రమాదాలకు కారణాలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు

రియాద్/పారిస్, జూన్ 28: ఒకేరోజు రెండు దేశాల్లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదాల్లో 25 మంది మృతి చెందారు. సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌లలో జరిగిన ఈ విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. సౌదీలో ఆదివారం రాస్ తానూరాలో ఆరామ్కోకు చెందిన హెలికాప్టర్ కూలిపోవడంతో 14 మంది దుర్మరణం చెందారు.

ఈ ఘటనపై అధికారులు అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులంతా సౌదీకి చెందిన వారే నని అధికారులు ధృవీకరించారు. ప్రమాదంపై సౌదీ ఇంధన మంత్రిత్వశాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపింది.

సౌదీ ఆరామ్కో సంస్థ పశ్చిమాసియాలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం సంస్థ. సంస్థ కార్యకలాపాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగిస్తుంది. ఈ సంస్థకు చెందిన 60కి పైగా హెలికాప్టర్లు సౌదీ అరేబియా వ్యాప్తం గా సేవలందిస్తున్నాయి. కాగా ఇరాన్‌పై అమెరికా యుద్ధం సందర్భంగా ౪ నెలలపాటు ఆరామ్కోలో నిలిచిపోయిన ముడిచమురు లోడింగ్‌ను శుక్రవారమే పునఃప్రారంభించారు. ఇంతలోనే ఈ ప్రమా దంపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఫ్రాన్స్‌లో 11 మంది మృతి

ఫ్రాన్స్‌లోని నాన్సీ సమీపంలో ఉన్న టోంబ్లున్ పట్టణంలో స్కైడైవర్లతో వెళుతున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. విమానం కూలి ముక్కలైపోయిందని, సంఘటనా ప్రాంతంలో భయంక రమైన దృశ్యాలు ఉన్నాయని తెలిపింది. కాగా విమానం కూలడానికి ముందు ముగ్గురు వ్యక్తులు బయటకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

మృతుల్లో పైలట్, ఐదుగురు స్కైడైవింగ్ శిక్షకులు, ఐదుగురు విద్యార్థులు ఉన్నారని మీడియా తెలి పింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి త్వ శాఖ విచారం వ్యక్తం చేసింది. ప్రమాదం పై అత్యున్నతస్థాయి దర్యాప్తు చేపట్టామని, ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది.